పరిషత్ ఎన్నికలు: నామినేషన్ల ప్రక్రియలో పకడ్బందీ భద్రత ఏర్పాటు చేయాలని డీఎస్పీ ఆదేశం
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
పరిషత్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఆయన గురువారం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందిని ఆయన ఆదేశించారు.