రాష్ట్రంలో నేరాల నియంత్రణకు 'త్రిశూల్' కమిటీ ఏర్పాటు: సీఎం చంద్రబాబు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు 'త్రిశూల్' పేరుతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో శాంతిభద్రతలపై ఆయన సమీక్ష నిర్వహించారు. నేరం చేస్తే తప్పించుకోలేమనే భయం నేరస్థుల్లో ఉండాలని, సోషల్ మీడియా అసభ్య పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు.