గోవాలో రక్షణ కల్పించేందుకు గోవా పోలీసులు నిరాకరణ

రిపోర్టర్: రాము స్థలం: గోవా

గోవాలో పోర్వోరిమ్ కాల్పుల ఘటన నేపథ్యంలో మేజెర్టిక్ ప్రైడ్ గ్రూప్ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్ తనకు ఎస్కార్ట్ మరియు పైలట్ వాహనాలతో కూడిన ప్రత్యేక భద్రత కల్పించాలని చేసిన అభ్యర్థనను గోవా పోలీసులు తిరస్కరించారు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు పురోగతి సాధించి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినందున ఆయనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని ఐజీపీ కేఆర్ చౌరాసియా స్పష్టం చేశారు.