హాకీ ఇండియా అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దిలీప్ టిర్కీ
రిపోర్టర్: నరేష్
స్థలం: New Delhi
హాకీ ఇండియా అంతర్గత వివాదాలు తారస్థాయికి చేరడంతో ఫెడరేషన్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిగత సామగ్రిని అపహరించడంతో పాటు నమ్మకద్రోహానికి పాల్పడ్డారంటూ కొందరి అధికారులపై ఆయన ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జెర్సీ రంగు మార్పు వివాదం, అత్యవసర సమావేశాల నిర్వహణపై కార్యదర్శి భోలానాథ్ సింగ్తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.