దేశ ప్రగతికి బాటలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: Andhra Pradesh

రైతుల పంటలకు పెరిగిన మద్దతు ధరల నుంచి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు వరకు దేశ ప్రగతికి బలమైన బాటలు వేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు BJP Andhra Pradesh వెల్లడించింది. వ్యవసాయ రంగం, ఆధునిక మౌలిక వసతుల కల్పన, పునరుత్పాదక ఇంధన రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొంది. ఈ కీలక నిర్ణయాల ద్వారా దేశంలోని అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని స్పష్టం చేసింది.