రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా వెల్లడి
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా వెల్లడించారు. ఆదివారం జరిగిన ఎన్నికల సమయంలో ఇరవై జిల్లాల్ లో నలభై ఒక్క స్వల్ప ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు డీజీపీ పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్ లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వివరించారు.