తిరుపతిలో మహిళల భద్రతపై శక్తి బృందం అవగాహన
రిపోర్టర్: గోపి
స్థలం: తిరుపతి
తిరుపతి పోలీసుల ఆధ్వర్యంలో శక్తి బృందం సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు, వర్కర్లతో పాటు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆటో డ్రైవర్లకు మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహిళల రక్షణ చట్టాలు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన నంబర్ల గురించి విస్తృతంగా వివరించారు.