రాజాపేట మండల నూతన విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కూచన మనోజ్ కుమార్
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల విద్యాధికారిగా రఘునాథపురం ఎస్ ఎస్ ఎన్ఎం ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కూచన మనోజ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎంఈఓ గా విధులు నిర్వర్తించిన చందా రమేష్ ఉద్యోగ విరమణ పొందడంతో నూతనంగా మనోజ్ కుమార్ నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం ఎంఈఓ మనోజ్ కుమార్ మాట్లాడుతూ రాజపేట మండలాన్ని విద్యాభివృద్ధిలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు.