'సిగ్మా మంచి ఫన్ రైడ్‌లా ఉంటుంది': డైరెక్టర్ జేసన్ సంజయ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

సందీప్ కిషన్ హీరోగా నటించిన యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'సిగ్మా' అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దర్శకుడిగా డెబ్యూ చేస్తున్న జేసన్ సంజయ్ మాట్లాడుతూ సినిమా మంచి ఫన్ రైడ్‌లా ఉంటుందని, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ట్రెజర్ హంట్ చిత్రమని తెలిపారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ తెలుగు, తమిళ ప్రేక్షకులకు తనపై ఉన్న ప్రేమ గొప్పదని, సంజయ్ ఎంతో అంకితభావంతో అనుకున్న సమయాని కంటే ముందే సినిమాను పూర్తి చేశారని ప్రశంసించారు.