ప్రమాదానికి గురైన కారుతో ఏలూరు పోలీసుల అవగాహన

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఏలూరు

పది నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదని, ప్రాణం చాలా ముఖ్యమని ఏలూరు పోలీసులు రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కల్పించారు. భీమడోలు సీఐ కృష్ణ, ఎస్ఐ మదీనా భాష ఆధ్వర్యంలో ప్రమాదానికి గురైన కారును డెమోగా ఏర్పాటు చేసి వాహనదారులకు రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వేగ నియంత్రణ మరియు సీటు బెల్ట్ ప్రాముఖ్యతపై ప్రచారం నిర్వహించారు.