వైద్యశాస్త్రంలో అద్భుతం: మనిషికి అమర్చిన పంది కిడ్నీ సక్సెస్

రిపోర్టర్: సునీల్ స్థలం: World

వైద్యశాస్త్రంలో సరికొత్త విప్లవం మొదలైంది. జన్యుపరంగా మార్పులు చేసిన పంది కిడ్నీని 67 ఏళ్ల వ్యక్తికి అమర్చగా, అది 271 రోజుల పాటు విజయవంతంగా పనిచేసింది. మానవ అవయవ మార్పిడికి సరైన దాత దొరికే వరకు, ఈ పంది కిడ్నీ ఒక వంతెనలా పనిచేస్తూ రోగికి ప్రాణభిక్ష పెట్టింది. డయాలసిస్ అవసరం లేకుండా ప్రాణాలను కాపాడే ఈ అరుదైన ప్రయోగం వైద్య రంగంలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.