వాహనదారులకు శుభవార్త: వంద శాతం ఇథనాల్ ఈ100 వాహనాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వంద శాతం ఇథనాల్తో నడిచే ఈ100 వాహనాలకు ఆమోదం తెలుపుతూ మోటార్ వెహికల్స్ రూల్స్లో సవరణలు చేసినట్లు స్పష్టం చేశారు. సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని, అయితే ఈ100 ఇంధనాన్ని కేవలం తగిన విధంగా తయారైన ప్రత్యేక వాహనాల్లోనే వినియోగించాలని కేంద్రం స్పష్టం చేసింది.