పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టాలని జనసేన నేత పిలుపు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని గోవిందరాజపురంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విగ్నేశ్వరునికి జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పల్లి సురేష్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరూ అరికట్టాలని గట్టిగా కోరారు. పూజల అనంతరం జరిగిన భారీ అన్నదాన కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.