'వ్యక్తిగత కక్షలతోనే హత్య': రౌడీషీటర్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
రిపోర్టర్: సురేష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
నాగోల్ పోలీస్స్టేషన్ పరిధి బండ్లగూడలో జరిగిన రౌడీషీటర్ మహ్మద్ నయీమ్ హత్య కేసును మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోలీసులు ఛేదించారు. కుటుంబసభ్యులను అసభ్య పదజాలంతో దూషించడం, మిత్రులతో అనుచితంగా ప్రవర్తించడంతో కక్ష పెంచుకున్న ఓట్ల దినకర్, కనకం ఉమామహేష్, సయ్యద్ రబ్బానీ సహా నిందితులు పథకం ప్రకారమే ఈ హత్యకు పాల్పడినట్లు సీపీ సుమతి ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో వెల్లడించారు.