సంజూ శాంసన్‌కు అవమానం: శ్రీశాంత్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ వైరల్ వీడియో
రిపోర్టర్: సునీల్
స్థలం: India
కేరళ క్రికెట్ లీగ్ ఫైనల్ వేడుకలో టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు అవమానం జరిగిందంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రెజెంటేషన్ వేదికపైకి వచ్చిన మాజీ పేసర్ శ్రీశాంత్.. అక్కడే ఉన్న సంజూ శాంసన్‌ను పట్టించుకోకుండా పక్కన ఉన్నవారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలున్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.