రైతులకు నీళ్లు కరెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ డైవర్షన్ డ్రామాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Telangana
కృష్ణా, గోదావరి నదుల నీటిని రైతాంగానికి అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందని, రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.