'ఎన్టీఆర్ భరోసా' కొత్త పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

తిరుపతి జిల్లా వెదురుకుప్పం మండలంలో అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు సెప్టెంబరు 7 నుంచి 16 వరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. అర్హత గల దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, రైస్ కార్డుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు.