కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి చెప్పేందుకు రైతు గర్జనకు కదలిరావాలన్న బీఆర్ఎస్

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

నవంబర్ మొదటి తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు గర్జన సభను అత్యంత విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేత పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆరోపించారు. ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.