యలమంచిలిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రిపోర్టర్: అశోక్ స్థలం: Yalamanchili, Andhra Pradesh

యలమంచిలి నియోజకవర్గంలోని రుక్మిణీపురం, రేగుపాలెం గ్రామాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారుల కృష్ణ వేషధారణలు, భక్తిపూర్వక వాతావరణంతో గ్రామాలు సందడిగా మారాయి. ప్రజలతో కలిసి ఎమ్మెల్యే వేడుకల్లో పాల్గొనడం విశేషం.