'తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం': పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో వేగంగా జేజేఎం పనులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Chittoor

ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో జేజేఎం - అమరజీవి జలధారల పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా కీలకమైన ఇంటేక్ వెల్, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణ పనుల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అధికారులు వెల్లడించారు.