జోగినాధునిపాలెంలో పల్లె నిద్రతో ప్రజల్లో భరోసా నింపిన నర్సీపట్నం పోలీసులు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని జోగినాధునిపాలెం గ్రామంలో టౌన్ పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో సహకరించాలని అధికారులు కోరారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు మరియు గంజాయి నియంత్రణపై గ్రామస్థులకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించి శాంతిభద్రతల పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.