ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం: యుద్ధప్రాతిపదికన భూములు గుర్తించాలని మంత్రి పొంగులేటి ఆదేశం
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూములను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన, ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన వెల్లడించారు.