విశాఖలో భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు: ఐదో విడత టైగర్ ట్రయంఫ్ ప్రారంభం

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

భారత్, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఐదో విడత టైగర్ ట్రయంఫ్ సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయని రియర్ అడ్మిరల్ విశాల్ బిష్ణోయ్ వెల్లడించారు. ఈ విన్యాసాల ద్వారా మానవతా సహాయం, విపత్తు నిర్వహణలో సమన్వయం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. రెండు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సైబర్, అంతరిక్ష రంగాలు సహా పలు వ్యూహాత్మక అంశాలపై ఈ సంయుక్త విన్యాసాలలో ప్రత్యేకంగా చర్చిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.