విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. అంతరాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు రాష్ట్రపతికి పట్టువస్త్రాలు బహూకరించారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. రేపు పున్నమి ఘాట్లో జరిగే సరస్ మేళాలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని అధికారులు తెలిపారు.