హైదరాబాద్‌లో కుటుంబసమేతంగా వినాయక పూజ చేసిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసంలో సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాంశ్‌లతో కలిసి వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లులని ఆయన ఈ సందర్భంగా మనసారా ఆకాంక్షించారు. ప్రజలందరికీ విఘ్నేశుడి కృప కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.