నిరుద్యోగులకు గుడ్ న్యూస్: వెయ్యికి పైగా అప్రెంటిస్ పోస్టుల భర్తీ

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

దేశంలోని నిరుద్యోగ యువతకు ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ సంస్థ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం వెయ్యికి పైగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఐటీఐ మరియు గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు నవంబర్ తొమ్మిదవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.