గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో అనుమతులు పొందండిలా

రిపోర్టర్: రాజేష్ స్థలం: Palnadu, Andhra Pradesh

వినాయక చవితి ఉత్సవాల కోసం గణపతి మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పల్నాడు పోలీసులు సూచించారు. ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసి అనుమతులు పొందవచ్చు. అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, పారదర్శకమైన ఈ ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా సులభంగా అనుమతులు పొంది, ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని అధికారులు కోరుతున్నారు.