ఆళ్లగడ్డ అభివృద్ధికి ముప్పై కోట్ల నిధులు: పట్టణ పనులకు భూమా అఖిలప్రియ శ్రీకారం

రిపోర్టర్: నరేష్ స్థలం: నంద్యాల

ఆళ్లగడ్డ పట్టణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో హెచ్ఏఎం కింద ఇరవై ఒక కోట్లతో మంజూరైన నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి వెల్లడించారు. మన భూమా మన ధీమా కార్యక్రమంలో భాగంగా పట్టణంలో చేపడుతున్న వివిధ పనులను పరిశీలిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.