మూడు వందల ఏళ్ల పాటు పనిచేసే సరికొత్త వాటర్ బ్యాటరీ ఆవిష్కరణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: చైనా

బ్యాటరీ టెక్నాలజీ రంగంలో చైనా శాస్త్రవేత్తలు సరికొత్త వాటర్ బేస్డ్ బ్యాటరీని అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాబ్ టెస్టుల్లో ఈ బ్యాటరీ ఏకంగా లక్షా ఇరవై వేల ఛార్జింగ్ సైకిల్స్ను తట్టుకుందని పేర్కొన్నారు. గ్రిడ్ నిల్వ కోసం దీనిని ఉపయోగిస్తే సుమారు మూడు వందల ఏళ్ల పాటు పనిచేస్తుందని అంచనా వేశారు. లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువని నిపుణులు వెల్లడించారు.