'ఆలయ భూముల కబ్జాపై చర్యలేవి?': విజయవాడలో దేవాదాయ శాఖ వైఫైర్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయవాడ

విజయవాడ మరియు శివారు ప్రాంతాల్లో దేవాదాయ శాఖకు చెందిన వందల కోట్ల విలువైన ఆలయ, మఠం భూములు కబ్జాకోరల్లో చిక్కుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారుల నిర్లక్ష్యం కారణంగా గొల్లపూడి పట్టాభిరామస్వామి ఆలయం, భవానీపురం కుమార సిద్ధయ్యస్వామి మఠానికి చెందిన కోట్ల విలువైన భూములు ఆక్రమణదారులపాలయ్యాయి. రికార్డుల్లో దేవాదాయ భూములుగా స్పష్టంగా ఉన్నప్పటికీ, వాటిని పరిరక్షించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.