మాడుగుల జాబ్ మేళాకు పోటెత్తిన వందలాది మంది నిరుద్యోగ యువత
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
మాడుగుల మండల కేంద్రంలో నిర్వహించిన ఇరవై ఆరో జాబ్ డ్రైవ్‌కు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. శ్రీ వాసవి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగు వందలకు పైగా నిరుద్యోగులు పాల్గొనగా అర్హత కలిగిన రెండు వందల పదిహేడు మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు చేరువ చేస్తున్నారు.