దసరా, దీపావళి పండుగల వేళ ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే శాఖ
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
దసరా, దీపావళి పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో బెంగళూరు – ముంబై, విశాఖపట్నం – బెంగళూరు మరియు చర్లపల్లి – శ్రీకాకుళం మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సౌకర్యార్థం చర్లపల్లి నుంచి శ్రీకాకుళం మధ్య అక్టోబర్ 6 నుంచి నవంబర్ 25 వరకు 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.