బాపట్ల జిల్లాలో పాఠశాల విద్యార్థులకు శక్తి బృందాల అవగాహన

రిపోర్టర్: వెంకట్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పాఠశాల విద్యార్థులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్‌పై స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నారు. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో మహిళలు, యువత భద్రత కోసం శక్తి యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.