ఐర్లాండ్ విలీనంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
రిపోర్టర్: సునీల్
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐర్లాండ్ పర్యటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్ విలీనం అద్భుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఐర్లాండ్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. డబ్లిన్ నగరంలో వేలాది మంది ప్రజలు, వామపక్ష సంఘాలు ఆయన పర్యటనను నిరసిస్తూ భారీ ఆందోళనలు చేపట్టారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి తీవ్ర నిరసన తెలిపారు.