గురుకుల టెండర్లలో రూ.900 కోట్ల స్కామ్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Telangana

గురుకులాల్లో రూ.2000 కోట్ల కుంభకోణం తర్వాత తాజాగా రూ.900 కోట్ల విలువైన టెండర్ల స్కామ్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అక్రమాలు ధారావాహికలా సాగుతున్నాయని, గురుకుల విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఘాటు విమర్శలు చేశారు.