రుషికొండ తీరంలో ఘోర విషాదం: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం రుషికొండ ఐటీహిల్స్ సమీపంలోని సముద్ర తీరంలో ఈతకు వెళ్లిన ఆరుగురు స్నేహితుల్లో ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి గల్లంతు అయ్యారని వైజాగ్ న్యూస్ మాన్ వెల్లడించారు. మధురవాడ పరిధిలోని మల్లయ్యపాలెంకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎస్. సూర్యప్రకాశ్, నితీశ్, ప్రశాంత్ సముద్రంలో గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.