బెల్లంపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించిన నాతరి స్వామి
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బెల్లంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాతరి స్వామి మరియు ఆయన సతీమణి సంధ్యారాణి దంపతులు తమ నివాసంలో బతుకమ్మను ఘనంగా పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన ఈ పండుగ సందర్భంగా ప్రజలందరికీ వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.