ప్రజల మధ్యే మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర: వార్డుల్లో విస్తృత పర్యటన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కృష్ణా

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాక్షేత్రంలో అడుగడుగునా నిలుస్తూ రెండో వార్డు నుంచి ఏడో వార్డు వరకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు, వీధి దీపాలు అలాగే రహదారుల ప్రస్తుత పరిస్థితులపై స్థానిక ప్రజలతో ముఖాముఖిగా చర్చించి తక్షణ సమస్యలను ఆరా తీశామని కొల్లు రవీంద్ర వివరించారు.