మక్కా నగరానికి క్షిపణుల ముప్పు పొంచి ఉందంటూ అత్యవసర అలెర్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: మక్కా

సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కాతో పాటు పశ్చిమ తీర నగరాలకు క్షిపణుల ముప్పు పొంచి ఉందంటూ నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్ఫామ్ అత్యవసర అలెర్ట్ జారీ చేసింది. యెమెన్కు చెందిన హూతీ రెబల్స్ ప్రయోగించిన ఆరు బాలిస్టిక్ క్షిపణులను సౌదీ కూటమి వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించాయి. మిడిల్ఈస్ట్లో పెరుగుతున్న ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరులను అప్రమత్తం చేయడంతో పాటు హూతీల దాడులను కఠినంగా ఎదుర్కొంటామని అధికారులు స్పష్టం చేశారు.