అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై వైఎస్సార్సీపీ వర్గాల దాడి
రిపోర్టర్: రమేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సమయంలో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేను రక్షించబోయిన ఆయన గన్మెన్ పై కూడా దాడికి తెగబడ్డారని, దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్ ద్వారా ఇరువర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని స్థానికులు పేర్కొన్నారు.