ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం
రిపోర్టర్: నరేష్
స్థలం: Alluri Sitharama Raju district
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతలమ్మ ఘాట్ రోడ్డులోని జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా మట్టి పెళ్లలు రహదారిపైకి పడిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.