మహబూబ్ నగర్ లో జాతీయ స్థాయి ఓపెన్ పురుషుల బాక్సింగ్ పోటీలు ప్రారంభం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా జేపీఎన్సీఈ కళాశాల మైదానంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఓపెన్ పురుషుల బాక్సింగ్ పోటీల్లో శుక్రవారం మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మ్యాచ్ లను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యువత క్రీడల్లో రాణించాలని, పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ క్రీడా వేడుకల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాక్సింగ్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.