సినీ డాన్సర్స్ అసోసియేషన్‌లో రచ్చ: పోలీస్ స్టేషన్‌కు చేరిన వివాదం
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్‌లో ఆధిపత్య పోరు ముదిరింది. నిధుల నిర్వహణ, బ్యాంకు లావాదేవీలపై రఘు మాస్టర్, సుమలత వర్గాల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం ఆరోపణలు చేసుకుంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. తమ కమిటీకే అధికారిక గుర్తింపు ఉందని రఘు మాస్టర్ వాదిస్తుండగా, సుమలత వర్గం చట్టపరమైన చర్యలకు పట్టుబడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.