ఎల్ నినో పేరుతో కాంగ్రెస్ డ్రామాలు అంటగడుతున్న జగదీశ్వర్ రెడ్డి
రిపోర్టర్: శివ
స్థలం: నల్లగొండ
నల్లగొండ జిల్లా కనగల్ మండలం తెలకంటిగూడెం గ్రామంలో ఎండిన పంట పొలాలను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో, బొగ్గు కొరత పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతూ రైతులను మోసం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామని, నేడు కాంగ్రెస్ పాలనలో నీరు, విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.