పాలమూరు ప్రాజెక్టులపై డీకే అరుణ విమర్శలు: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ నిలదీత
రిపోర్టర్: విజయ్
స్థలం: కొడంగల్
పాలమూరు సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. శనివారం కొడంగల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇళ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారని సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. రోడ్డు విస్తరణ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఎంపీ డిమాండ్ చేశారు.