ఏపీ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రత్యేక శిక్షణ

రిపోర్టర్: కిరణ్ స్థలం: Andhra Pradesh

దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆ కోటి మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 50 లక్షల మంది విద్యార్థులు ఉండేలా ప్రత్యేక లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విద్యార్థులను సాంకేతిక రంగంలో తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.