హైదరాబాద్లో విషాదం: వీడియో కాల్లో బెదిరించి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చనాచౌదరి మాలిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని వీడియో కాల్లో బెదిరించి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. అర్చనాచౌదరి మృతితో ఐటీ హబ్లో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.