తెలుగు వైద్యుల దాతృత్వం: యూసీఎస్ఎఫ్కు కోటి విరాళం ప్రకటించిన అంబటి దంపతులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమెరికా

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు తెలుగు సంతతి వైద్యులు డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి, రమ అంబటి దంపతులు రూ.10 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. సాన్ జోవాక్విన్ లోయలో వైద్య విద్య మరియు పరిశోధనలు బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ శాశ్వత నిధిని ఏర్పాటు చేసినట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ నిధి ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైద్య విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు వారు స్పష్టం చేశారు.