22ఏ భూముల అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని నియమించిన ప్రభుత్వం

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ భూముల అక్రమాల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మాజీ మంత్రులు, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల భూములపై సమగ్రంగా విచారణ జరిపేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి దేవసేన చైర్పర్సన్గా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో నంబర్ 134 విడుదల చేశారు. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో జరిగిన భూకేటాయింపుల అక్రమాలపై ఈ కమిటీ విచారించనుంది.