భారీ వర్షాల నేపథ్యంలో సముద్రంలో వేటకు వెళ్లవద్దన్న జేసీ అపూర్వ భరత్
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: యు.కొత్తపల్లి
భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జేసీ అపూర్వ భరత్ సూచించారు. గురువారం తహశీల్దార్ చిన్నారావుతో కలిసి ఉప్పాడ సముద్ర తీరాన్ని పరిశీలించారు. సముద్ర అలల ఉధృతి, మత్స్యకారుల సమస్యలు, తీర ప్రాంత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తాము ఆదేశించే వరకు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. తీరంలో చేపడుతున్న రక్షణ చర్యలను ఈ సందర్భంగా తహశీల్దార్ ఆయనకు వివరించారు.